Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2015 18:04:14
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ చేయబోతున్న నెక్ట్స్ మూవీ తని ఒరువన్ రీమేక్ లో బోలెడు ట్విస్టులు తగులుతున్నాయి. ఇవేవో స్టోరీ ప్రకారం మూవీలో వచ్చే ట్విస్టులు కాదు.. ప్రారంభానికి ముందే టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. మొదట అసలీ సినిమాని రీమేక్ చేయాలా వద్దా అన్నది ఫస్ట్ డౌట్ అయితే.. చెర్రీ పట్టుదలతో సై అనక తప్పలేదు. ఆ తర్వాత స్టోరీలో మార్పుల గురించి డిస్కషన్ నడిచింది. చివరకు మెగాస్టార్ రంగంలోకి దిగి.. అసలీ కాన్సెప్ట్ ని అక్షరం కూడా మార్చక్కర్లేదని చెప్పడంతో.. ఎట్టకేలకు ప్రాజెక్ట్ ఫైనల్ అయింది.

ఆ తర్వాత ఏర్పడ్డ ట్విస్ట్ విలన్ రోల్ ఎవరు చేస్తారనే. దీనికి అక్కినేని నాగార్జున నుంచి పలు క్రేజీ కాంబినేషన్స్ అనుకుని.. చివరకు ఒరిజినల్ లో చేసిన అరవింద్ స్వామినే కన్ఫాం చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా.. స్వామికి అడ్వాన్స్ మంచి రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు సడెన్ గా ఏమైందో కానీ.. మంచు వారబ్బాయి మనోజ్ పేరు తెరపైకొచ్చింది. మంచి కేరక్టర్స్ అయితే విలన్ రోల్స్ అయినా చేస్తానని తండ్రి వేసిన రూట్ ని కంటిన్యూ చేస్తానని.. రీసెంట్ గా మంచు మనోజ్ చెప్పాడు. దీనికి తగినట్లుగానే తని ఒరువన్ లో విలన్ రోల్ చేస్తానంటూ ముందుకొచ్చాడట.

ఒకవేళ వీళ్ల కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. అప్పట్లో చిరు-మోహన్ బాబు మాదిరిగా.. ఇప్పుడు చెర్రీ- మనోజ్ ల ఆన్ స్క్రీన్ వార్ ని చూడచ్చు. కేరక్టర్స్ ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయడంలో మనోజ్ కి మంచి పేరే ఉంది. దీనికి తోడు తని ఒరువన్ లో స్టైలిష్ విలన్ కేరక్టర్ కావడంతో.. మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి చెర్రీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు.. ఈ మార్పులతో ఆపుతాడో.. లేక మళ్లీ ఏదైనా ట్విస్ట్ తీసుకొస్తాడో ?

,  ,  ,