Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 12:13:05
facebook Twitter Googleplus
Photo

మంచు విష్ణుకి కామెడీ జోనర్ ఎప్పుడూ సేఫ్ అనిపించేస్త ఉంటుంది. ఢీ నుంచి మొదలుపెడితే విష్ణు చేసిన కామెడీ సినిమాలు దాదాపు అన్నీ క్లిక్ అయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డితో తీసిన దేనికైనా రెడీ.. ఈడోరకం ఆడోరకం అయితే.. అంచనాలకు మించిన విజయం సాధించేశాయి. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

మంచు విష్ణు-జి నాగేశ్వరరెడ్డిల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ఆచారి అమెరికా యాత్ర. ఇది కూడా పూర్తి స్థాయి కామెడీ చిత్రమే కాగా.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది. ప్రస్తుతం జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విష్ణు.. ఇది పూర్తి కాగానే ఆచారి అమెరికా యాత్ర మూవీని ప్రారంభించేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి మేజర్ పోర్షన్ అమెరికాలోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కి క్రేజ్ ఉండడంతో.. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలను ఈ ప్రాజెక్టు ఆకర్షిస్తోంది.

,  ,  ,  ,  ,