ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ త్వరలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిజజీవిత పాత్రను పోషించనున్నాడు. రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్' చిత్రం నిన్న విడుదలైంది. రాంగోపాల్ వర్మ జీవితంపై సెటైర్ గా రూపొందిందన్న పేరు తెచ్చుకున్న ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో నటించడానికి మనోజ్ బాజ్ పాయ్ అంగీకరించినట్టు దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ తెలిపారు. ముంబయ్ వెళ్లి చిత్ర కథను ఆయనకు వినిపించడం జరిగిందనీ, వినగానే చేయడానికి ఆయన ఒప్పుకున్నారనీ దర్శకుడు చెప్పారు. ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలసి దీనిని హిందీలో తీయడానికి చర్చలు జరుపుతున్నామని దర్శకుడు తెలిపారు.
manojbajpai, rgv, bollywood, news,