Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 15:04:23
facebook Twitter Googleplus
Photo

సినిమా అంటే ఫైట్స్.. డైలాగ్సే కాదు పాటలు కూడా. ఫేవరెట్ హీరోస్ లీడింగ్ లేడీస్ తో అలా ఓ కలర్ ఫుల్ సాంగ్ వేసుకుంటుంటే కూర్చోని మూవీ చూసే ఆడియెన్స్ కి వచ్చే థ్రిల్లే వేరు. పాటే కాదు లోకేషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటేనే విజువల్ ఫీస్ట్. అందుకే తెలుగు సినిమా పాటల్లో చాలా వరకు బ్యూటిఫుల్ ఫారిన్ లోకేషన్స్ కనిపిస్తుంటాయ్. ఇక మెగా హీరోల సినిమాల పాటల్లో అయితే ఎప్పుడూ చూడని కొత్త కొత్త ప్లేస్ లు కనిపిస్తుంటాయ్.

ఇక ఎవరికీ వారు ముందే ఫిక్స్ చేసుకున్నారో.. లేక అలా కలిసొచ్చేసిందో గానీ మెగా హీరోలంతా ఇప్పుడు అబ్రాడ్ లో హీరోయిన్స్ తో సాంగ్స్ వేసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తో మొదలుపెడితే చిరంజీవి సినిమా అంటే ముందు పాటలు.. స్టెప్సే. అభిమానులకి ఏం కావాలో చిరుకి కూడా తెలుసు అందుకే ఖైదీ నెంబర్ 150లో పాటల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు బాస్. కాజల్ తో వచ్చే డ్యూయెట్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. పనిలో పనిగా టర్కీలో కూడా ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ తీయనున్నారు. కో ఇన్సిడెంట్లీ ఇటు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా విన్నర్ మూవీ కోసం ఉక్రెయిన్ లోనే రకుల్ తో రొమాన్స్ చేశాడు. ప్రస్తుతం అనసూయతో అక్కడే ఓ పాటకి స్టెప్స్ వేస్తున్నాడు.

మరోవైపు ధృవ సాంగ్ కోసం బ్యాంకాక్ లోని క్రాబీ దీవులకి వెళ్లాడు రామ్ చరణ్. అక్కడ రకుల్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇలా మెగా హీరోలు ఫారిన్లో పాటల సందడి చేస్తుంటే ఇటు అల్లు హీరోలు లోకల్ గా బిజీగా ఉన్నారు. దువ్వాడ జగన్నాథమ్ కోసం బన్నీ హైద్రాబాద్ లో షూటింగ్ చేస్తుండగా.. ఫస్ట్ టైం మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న శిరీష్ రాజస్థాన్ లో హంగామా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ఒక్కడే ప్రస్తుతం షూటింగ్ కి బ్రేకిచ్చాడు. కాలికి దెబ్బ తగలడంతో వరుణ్ తేజ్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు.

,  ,  ,  ,