Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 15:54:10
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో సందీప్ కిషన్ జోరు బాగానే ఉంది. వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడినా.. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుతో ఆకట్టుకోబోతున్నాడు. క్రియేటివ్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రంలో హీరోగా నటించడంతోపాటు.. తమిళ్ లో కూడా రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. మానగరం.. మాయావన్ మూవీస్ కూడా రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి.

నక్షత్రం.. మానగరం చిత్రాల్లో రెజీనాతో జోడీ కట్టిన సందీప్ కిషన్.. మాయవన్ లో లావణ్య త్రిపాఠితో చేస్తున్నాడు. ఇప్పుడీ కుర్రాడికి కొత్త సినిమా కూడా ఖాయమైంది. ఇందులో నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధలో నటించిన మెహ్రీన్ కౌర్ పీర్జాడాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. నా పేరు శివ ఫేమ్ సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. ఇప్పటికే ఈ మెహ్రీన్ ను అప్రోచ్ కావడం.. ఆమె ఖాయం చేసేయడం కూడా పూర్తయిపోయాయి.

సందీప్ కిషన్-మెహ్రీన్ కౌర్ లు ఇద్దరికీ తెలుగులో కూడా క్రేజ్ ఉండడంతో.. ఈ మూవీని తెలుగు తమిళ భాషలు రెండింటిలోనూ రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు ఊపందుకోగా.. త్వరలో మిగిలిన డీటైల్స్ వెల్లడి కానున్నాయి.

,  ,  ,  ,  ,