Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 16:39:15
facebook Twitter Googleplus
Photo

నేచర్ అంటే ఏంటి? చెట్లు చేమలూ ఆకులు అలమలూ జంగిల్ బుక్ లో ఉండే జంతువులు కాదు.. మొత్తంగా భూమి అంతా కలిపే నేచర్. కాని చాలా తెలివిగలవాడైన మనిషి.. ఈ ప్రపంచాన్ని చాలా విధాలుగా నాశనం చేస్తున్నాడు. అందుకే యునెస్కో తతత వంటి సంస్థలు ఎలాగైనా పుడమిని కాపాడాలని చాలా ప్రయత్నాలే చేస్తుంటాయి. వీళ్ళే కాకుండా చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు.. పరిరక్షకులు ఎన్నోవిధాలుగా భూమిని బాగు చేయాలని చూస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి ఒక పాయింట్ నే ''జనతా గ్యారేజ్'' లో టచ్ చేశాడు కొరటాల. ఓవరాల్ గా సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ఒక నేచర్ లవర్ గా ఎన్టీఆర్ పలికిన కొన్ని డైలాగులు మాత్రం అదిరిపోయాయ్. ''మనం ఈ భూమి మీద జస్ట్ టెనెంట్స్ (అద్దెకుండే వారం).. తరువాత తరానికి మనం దీనిని జాగ్రత్తగా అప్పజెప్పాలి'' అనే మీనింగులో ఒక డైలాగ్ హృదయాన్ని టచ్ చేసింది. అలాగే నీ నా కాదు.. మనం - మనందరిది అనే పాయింట్ కూడా బాగా చెప్పించాడు. సమస్యను ప్రజలకు చెప్పడానికి ''2012'' సినిమా రేంజు అంత డెప్తుల్లోకి వెళ్లకపోయినా కూడా.. డైలాగుల ద్వారా బాగానే ఎక్కించే ప్రయత్నం చేశాడు కొరటాల శివ. ఆ విషయంలో మనోడిని మెచ్చుకోవాల్సిందే.

గో గ్రీన్ వంటి సంస్థలకు జనతా గ్యారేజ్ సినిమా ఎంబాసిడర్ లా ఉందంటే చూసుకోండి. కాకపోతే సినిమా పెర్ఫామెన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

,  ,  ,  ,  ,  ,