Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:43:50
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలయ్య కూడా పలువురు అగ్ర దర్శకులతో చర్చలు చేస్తూనే ఉన్నారు. నిజానికి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ తో ఓ గెస్ట్ రోల్ చేయిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

ఇప్పుడు మోక్షజ్ఞ బాడీ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఫిజిక్ ను ఆకర్షణీయంగా మార్చుకునేందుకు తెగ వర్కవుట్స్ చేస్తున్నాడట. మోక్షజ్ఞను లాంఛ్ చేయబోతే దర్శకుడిగా.. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. అయితే.. బాలయ్య ఆలోచన మాత్రం వేరేలా ఉందని తెలుస్తోంది. తన కొడుకు అరంగేట్రం సింపుల్ గా ఉండాలని భావిస్తున్నారట నందమూరి బాలకృష్ణ. సింగీతంతో సినిమా చేసే అవకాశం ఉన్నా.. అది మోక్షజ్ఞకు రెండో సినిమా కానీ.. మూడో సినిమా కానీ అవుతుంది తప్ప తొలి చిత్రం అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

మోక్షజ్ఞ తొలి చిత్రం విపరీతమైన హైప్ మధ్య కాకుండా.. సింపుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట బాలకృష్ణ. పంచ్ డైలాగులు.. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండేలా కాకుండా.. హైప్ క్రియేట్ కాకుండా.. ఒక సింపుల్ స్టోరీతో సినిమా చేయాలని చూస్తున్నారట బాలకృష్ణ.

,  ,  ,  ,  ,