Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 16:08:34
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా మొదలై ఐదారు నెలలవుతున్నా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం కూడా బయటికి రాలేదు. దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఒకింత నిరాశగా ఉన్న సమయంలో.. ఈ చిత్రంలో నటిస్తున్న కమెడియన్ ప్రియదర్శి చెప్పిన మాట అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చింది. ఒక అద్భుతమైన సినిమా కోసం ఇలా ఎదురు చూడటంలో తప్పేమీ లేదన్నాడు ప్రియదర్శి. ఇప్పుడు స్వయంగా దర్శకుడు మురుగదాసే తన సినిమా గురించి చేసిన ట్వీట్.. అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబుకు కృతజ్నతలు చెబుతూ.. ?బ్లాక్ బస్టర్ ఆన్ ద వే? అంటూ మురుగదాస్ ట్వీట్ చేయడం విశేషం. మామూలుగా మురుగదాస్ తన సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉండగా వాటి గురించి పెద్దగా మాట్లాడడు. కానీ మహేష్ సినిమా గురించి ఆయన ఎంత కాన్ఫడెంట్ గా ఉన్నాడో అర్థమవుతోంది. మురుగ-మహేష్ కాంబినేషన్ అనగానే అంచనాలు భారీ స్థాయికి చేరగా.. ఇప్పుడు మురుగ ట్వీట్ తో అవి మరింత పెరిగిపోవడం ఖాయం. ఐదు నెలల నుంచి ఈ సినిమా కోసం నిర్విరామంగా పని చేస్తున్నారు మురుగ.. మహేష్. ఇంకో నెల రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,  ,