Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 17:07:58
facebook Twitter Googleplus
Photo

ఈరోజు దివంగత సంగీత దర్శకులు చక్రి పుట్టినరోజు కావడంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో చక్రి అభిమానులు ,కుటుంబ సభ్యులు దాదాపు వందమంది కలిసి రక్తదానం చేసారు . ఈ రక్త దాన కార్యక్రమం చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగింది . రక్తదానం తో పాటు బసవరామతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో దాదాపు 200 మందికి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు . ఈ సందర్భంగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ '' ఈరోజు అన్నయ్య చక్రి ,అలాగే మా నాన్న జిల్లా వెంకట నారాయణ పుట్టినరోజు కూడా కావడంతో ఇద్దరి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రెండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని , దీనికి అన్నయ్య అభిమానులు , మిత్రులు , కుటుంబ సభ్యులు అందరూ సహకరిస్తున్నారని ,అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాడమే నాముందున్న లక్ష్యమని అందుకోసం అహర్నిశలు శ్రమిస్తానని ........... ఇక నా విషయానికి వస్తే ఇప్పటికే రెండు రామప్ప , లవ్ యు బంగారం చిత్రాలకు సంగీతం అందించానని అలాగే ప్రస్తుతం సాయి రామ్ శంకర్ నటిస్తున్న ''నేనో రకం '' చిత్రానికి సంగీతం అందిస్తున్నానని ఆ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుందని , అన్నయ్య ని ఆదరించినట్లుగానే నన్ను కూడా ఈ చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు

,  ,  ,  ,  ,  ,