Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 09:58:37
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ మొన్నటీ వరకు కాంట్రవర్సీలతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఆయనకు సైలెంట్ గా చేసుకుంటూ పోయే పని దొరకడంతో కొన్నిటికి దూరంగా ఉంటున్నాడేమో అనిపిస్తోంది. నాగార్జున తో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే వర్మ ద్రుష్టి మొత్తం ఇప్పుడు ఆ సినిమాపైనే ఉంది.

అందుకేనేమో రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చిన ఇవాంకా గురించి కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడు తన వల్ల హాట్ న్యూస్ కావాలి గాని వేరొకరి వల్ల తనకి సంబందించిన న్యూస్ వైరల్ కావొద్దని అనుకుంటాడు. అందుకే తనకు సంబంధించినంత వరకు ఏ రూమర్స్ వచ్చినా వెంటనే కౌంటర్ వేస్తాడు. నాగార్జునతో తీయబోయె సినిమాలో హీరోయిన్ పై ఇన్ని రోజులు కొన్ని రూమర్స్ వచ్చాయి. ఎవరెవరో పేర్లు కూడా వినిపించాయి. అయితే వర్మ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

"నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయిన్ గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్ ఈ ఫొటోలు ఆ అమ్మాయివే" అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

,  ,  ,  ,  ,  ,