Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 10:21:27
facebook Twitter Googleplus
Photo

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు... సాహస బాలుడు-విచిత్ర కోతి వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలనటుడు నాగ్ అన్వేష్ అందికీ బాగానే గుర్తు. ఈ మధ్యనే హీరోగా వినవయ్య రామయ్య చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు కూడా. ఈ చిత్రం పబ్లిసిటీ ఓ రేంజ్ లో చేయడంతో సినిమాకు బాగా హైప్ వచ్చింది. నాగ్ అన్వేష్ అంటే ఎవరని అప్పట్లో బాగా ఆరా తీశారు కూడా. ట్రైలర్స్ లో బాలనటుడిగా నటించిన చిత్రాల క్లిప్పింగ్ లు చూపించినా... అతని పర్సనల్ బ్యాక్ గ్రౌండ్ ను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపారు. అలాంటి నాగ్ అన్వేష్ ప్రస్తుతం తన రెండో చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడట.

తన మొదటి చిత్రం వినవయ్యా రామయ్యాతో మంచి నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ కుర్రహీరో... తన రెండో సినిమాతో ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. రెండో సినిమా కోసం చాలా కథలు ఇప్పటికే విన్నాడట. సుమారు ఓ అరవై కథలు దాకా వినుంటాడట ఈ యంగ్ హీరో. అయితే చివరకు ఓ స్టోరీ ఓకే చేసి దాని పై ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నారని సమాచారం. పక్కా ప్లానింగ్ తో ప్రీ పొడక్షన్ వర్క్ అయ్యాకే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు నాగ అన్వేష్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు హీరోయిన్ ఎవరు తదితర విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

,  ,  ,  ,  ,  ,