Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 13:27:54
facebook Twitter Googleplus
Photo

కొత్త టాలెంటుని ప్రోత్సహించడంలో టాలీవుడ్లో అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా. హీరోగా ఇంకా నిలదొక్కుకోకముందే రామ్ గోపాల్ వర్మకు అవకాశం ఇచ్చాడు. ఆ రోజుల్లో పెద్దగా ఇండస్ట్రీ అనుభవం లేని వర్మను నమ్మి.. ?శివ? లాంటి వైవిధ్యమైన సినిమా చేయడం నాగార్జునకే చెల్లింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది కొత్త దర్శకులకు ఛాన్సిచ్చాడు నాగ్. ఆ కోవలో చందూ మొండేటి కూడా చేరాల్సిందట. తన తొలి సినిమాను నాగార్జునతోనే చేయాల్సిందట చందూ. అందరూ ?కార్తికేయ? తర్వాతే చందూ నాగార్జునను కలిశాడని అనుకుంటున్నారు. కానీ తన తొలి సినిమానే నాగ్ తో చేద్దామని చూసిన కాన్ఫిడెన్స్ చందూదని నాగచైతన్య మాటల్ని బట్టి తెలుస్తోంది.

చందూ తన తొలి సినిమాను తన తండ్రితో చేద్దామని ఆయన్ని కలిశాడని.. ఐతే నాగ్ ఇంప్రెస్ అయినప్పటికీ అప్పటికి ఖాళీ లేకపోవడంతో తర్వాత చేద్దామన్నాడని.. ఈలోపు చందూ ?కార్తికేయ? చేశాడని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమా తర్వాత మరోసారి నాగార్జునను కలిస్తే ముందు తనతో సినిమా చేయమని చెప్పాడని చైతూ వెల్లడించాడు. తన కోసం చందూ ఓ వైవిధ్యమైన కథ చెప్పాడని.. ఐతే ఆ సమయంలోనే తనకు ?ప్రేమమ్? నచ్చి.. తన రిక్వెస్ట్ మేరకు కొంచెం అయిష్టంగానే ?ప్రేమమ్? రీమేక్ చేశాడని చైతూ వెల్లడించాడు. ముందు తటపటాయించినా.. తర్వాత చందూ ఇష్టపడే ఈ సినిమా చేశాడన్నాడు. చందూతో తర్వాత డైరెక్ట్ సినిమా చేస్తానని కూడా చైతూ వెల్లడించాడు.

,  ,  ,  ,