గౌతం మీనన్ తెలివైన దర్శకుడు. ఒకే సినిమాని అటు తమిళ్ లో ఇటు తెలుగులో తీసి అమ్మేయగల సమర్ధుడు.అయితే ఇలా సినిమా తీయాలంటే చాలా ప్లాన్ వుండాలి. లేదంటే.. సినిమా..?సాహసం శ్వాసగా సాగిపో?లా తయారౌతుంది.
ఎప్పుడో రెండేళ్ళ క్రితం మొదలైన సినిమా ఇది. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమాపై చాలా కన్ఫిడెంట్ గా వున్నాడు నాగాచైత్యన. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో చైతు నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ?ఈ సినిమా తెలుగు వెర్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇబ్బందంతా తమిళ వెర్షన్ తోనే. ఈ మధ్యే ఓ పాట తీశారు. దీంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందని. నవంబర్లో రిలీజ్ ఉండొచ్చు.అయితే సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది? అని చెప్పుకొచ్చాడు చైతు.