Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jan-2017 11:59:21
facebook Twitter Googleplus
Photo

మాజీ హీరోయిన్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోజా.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్యూ చేయడం అనేది ఒక రేర్ అండ్ డిఫరెంట్ ఫీట్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే అండ్ రైవల్ అయిన రోజా.. నిజానికి చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయన సతీమణి సురేఖను అక్క అని పిలుస్తూ వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లా ఉంటుంది. ఈ సందర్భంగా రోజా చిరంజీవి కోసం ఒక 'మాస్' డెఫినషన్ చెప్పిందిలే.

''ఒకప్పుడు మాస్ అంటే కేవలం క్రింద నేల మీద కూర్చునే ఆడియన్స్ మాత్రమే. కాని మీ సినిమాలు వచ్చిన తరువాత.. నేల బెంచి బాల్కనీ అందరూ మాస్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మీ సినిమాలను ఒకే తరహాలో ఎంజాయ్ చేస్తారు. వీలలు వేస్తూ అరుపులు అరుస్తూ మైకంలోకి జారుకుంటారు. మాస్ కి మీరు మీనింగ్ కొత్తగా డిఫైన్ చేశారు'' అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్ద్యేశించి రోజా కామెంట్ చేశారు. ''అవును నిజమే'' అంటూ చెప్పిన చిరు.. అందుకోసమే తాను మాస్ పల్స్ ఉన్న కమర్షియల్ సినిమాలనే చేస్తున్నట్లు వివరించారు. ప్రయోగాలు ఫలించవు అని కాదు కాని.. తన ఇమేజ్ కు అవి సెట్టవ్వవు అని ఆయన కన్ఫామ్ చేసేశారు.

పైగా గతంలో తనకు రుద్రవీణ.. ఆపద్భాందవుడు వంటి క్లాస్ సినిమాలు నటుడిగా ఎంతో సంతృప్తి ఇచ్చినప్పటికీ.. కమర్షియల్ గా ఫెయిల్యూర్ చవిచూడ్డంతో.. అప్పటినుండి తాను మాస్ అండ్ మసాలా సినిమాలకే పెద్ద పీట వేసినట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి. అందుకే ఆయన ''కత్తి'' సినిమాను ఎంచుకుని.. ''ఖైదీ నెం 150''గా దించారట. కాకపోతే ఈ సినిమాలో సామాజిక స్పృహ ఉన్న కోణం కూడా ఉండటం కలిసొచ్చింది అంటున్నారు.

,  ,  ,  ,  ,