గతేడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ ను విభిన్నంగా ప్రెజెంట్ చేస్తూ.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేసిన మ్యాజిక్ కి.. టాలీవుడ్ ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు. ఆ వెంటనే నాగ్ క్యాంప్ లో మరో మూవీ ఈ దర్శకుడికి ఖాయమైంది.
అక్కినేని నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ కొత్త మూవీ ఇప్పటికే మొదలైపోయింది. ప్రస్తుతం ఈ మూవీకి టైటిల్ వెతికే పనిలో ఉంది టీం. నాగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నిన్నే పెళ్లాడుతా స్టైల్ లో ఈ మూవీ స్టోరీ ఉంటుందని టాక్. ఇప్పుడీ చిత్రానికి టైటిల్ గా 'అల్లరి అల్లుడు' అనే పేరును పరిశీలిస్తున్నారట. ఇది కూడా నాగ్ సూపర్ హిట్స్ లో ఒకటి అనే సంగతి తెలిసిందే. అప్పట్లో వాణిశ్రీకి అల్లుడిగా.. నగ్మా-మీనాలతో నాగ్ చేసిన సందడి జనాలకు ఫుల్లుగా నచ్చేసింది. ఇప్పుడీ టైటిల్ ని చైతు సినిమా కోసం పరిశీలిస్తున్నారు.
మరోవైపు హలోబ్రదర్ మూవీలోని 'ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ' సాంగ్ ను చైతు-కళ్యాణ్ కృష్ణల మూవీ కోసం రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. నాగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నిటినీ మళ్లీ గుర్తు చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై హైప్ క్రేజ్ అన్నీ పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ స్లాట్ కోసం దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ తో నాగ చైతన్య ఈ మూవీలో రొమాన్స్ చేయనున్నాడు.