Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 14:21:52
facebook Twitter Googleplus
Photo

సమ్మర్ అయ్యేలోపు తన రెండు సినిమాలూ చూపించేలా ఉన్నాడు నాగచైతన్య. ఒక పక్క ప్రేమమ్ తోనూ మరో పక్క సాహసం శ్వాసగా సాగిపోతోనూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రేమమ్ కంటే ముందుగానే సాహసం శ్వాసగా... సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ చిత్రబృందం డిసైడ్ అయ్యింది. అందుకే మిగిలిన చివరి పాటని తెరకెక్కించే పనిలో పడింది. ప్రస్తుతం ఆ పాట కోసం టర్కీలో గడుపుతున్నాడు చైతూ. కథానాయిక మంజిమ మోహన్ తో కలిసి డ్యూయెట్టు వేసుకొన్నాడు. రెండు మూడు రోజుల్లో ఆ పాట పూర్తవుతుంది. ఆ వెంటనే ఆడియో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారు. మేలోపు ఆ సినిమాని విడుదల చేసేలా కనిపిస్తున్నారు.

గౌతమ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంపై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఏమాయ చేసావెతో లవర్ బోయ్ ఇమేజ్ తో పాటు హిట్టిచ్చిన గౌతమ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తనకి మాస్ ఇమేజ్ నూ తీసుకొస్తాడని నాగచైతన్య నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రంలో తొలి సగభాగం ప్రేమకథ - మలిసగభాగంలో యాక్షనూ ఉంటుందట. గౌతమ్ మీనన్ ప్రేమకథల్ని ఎంత బాగా తీస్తుంటాడో యాక్షన్ కథల్ని అంతకంటే బాగా తీస్తుంటాడు. అందుకే నాగచైతన్యకి ఆయనపై అంత గురి. ఇప్పుడు చైతూకి సక్సెస్ చాలా అవసరం. వరుసగా వచ్చిన కొన్ని సినిమాలు ఆయన్ని తీవ్రంగా నిరాశపరిచాయి. అందుకే ఈ యేడాది అటు ప్రేమమ్ తోనూ ఇటు సాహసం శ్వాసగా సాగిపోతోనూ విజయం అందుకోవల్సిందే అన్న కసితో ఉన్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,