Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2016 12:27:17
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. మలయాళ ప్రేమమ్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి అనుగుణంగా కొన్ని మార్పుచేర్పులు చేశాడు. ఈ సినిమాలో ఎవరే అంటూ సాగే ఓ పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. మలయాళంలో మలరే సాంగ్ ను.. తెలుగులో ఎవరే అంటూ మార్చారు. ఇప్పుడీ తెలుగు ప్రేమమ్ లో శృతి హాసన్ తోనే కాకుండా.. మడొన్నాతో కూడా చైతు పాట పాడేసుకుంటున్నాడు.

ప్రేమమ్ లో ముగ్గురు హీరోయన్స్ ఉన్నపుడు అందులో ఓ హీరోయిన్ తో పాట పెట్టడం పెద్ద విచిత్రమా అనుకోవచ్చు. కానీ ప్రేమమ్ సినిమాలో నిజానికి హీరో అండ్ మడోన్నా క్యారెక్టర్ ల మధ్య పాట ఉండదు. ఓ టీజింగ్ సాంగ్ అలా వచ్చి వెళ్లిపోతుందంతే. కానీ ఇక్కడ వీళ్లిద్దరూ కలిసి డ్యుయెట్ పాడేసుకుంటున్నారనే విషయం అర్ధమవుతోంది. ఇంతకీ ఈ పాట కోసం వీళ్లు ఎక్కడికెళ్లారో తెలుసా?

దానికి కూడా ప్రేమమ్ యూనిట్ ఓ హింట్ ఇచ్చింది. బ్యాంగ్ బ్యాంగ్ సౌండ్ ట్రాక్ సెప్టెంబర్ 8న విడుదల అంటూ ఓ పోస్టర్ ఇచ్చారు. ఇందులో కనిపిస్తున్న లొకేషన్ నార్వేలోని ఓస్లో నగరం. ప్రేమమ్ చిత్రానికి గాను గతంలో విడుదల చేసిన ఎవరే సాంగ్ ని కూడా నార్వేలోనే చిత్రీకరించారు. మొత్తానికి హీరోకి ఇద్దరు హీరోయిన్లు పరిచయమయ్యేందుకు మధ్య టైమ్ గ్యాప్ ఉంటుంది కానీ.. వాళ్లిద్దరినీ పాటల కోసం ఒకే చోటకు పట్టుకెళ్లాడన్నమాట చైతు.

,  ,  ,  ,  ,