Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 17:11:39
facebook Twitter Googleplus
Photo

చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ హార్డుకోర్ అభిమానులు హర్టయిన మాట వాస్తవమే. అయితే బన్నీకి ఇదే మొదటిసారు కాదు. గతంలో కూడా.. వివిధ ఆడియో ఫంక్షన్లలో.. మీరు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నారో అది నేను చెప్పను.. కాని నేను ఏం చెప్పాలని డిసైడయ్యానో.. అది మాత్రమే చెబుతానంటూ కామెంట్ చేశాడు కూడా. ఇకపోతే పబ్లిక్ గానే కొన్ని పోస్టర్లు కూడా రెడీ చేసి.. బన్నీ పేరు రాయకుండా బన్నీని పవన్ ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే రంగంలోకి దిగి ఈ ఇష్యూ ఏదో సెటిల్ చేయాలని నాగబాబు హెల్ప్ అడిగారట అల్లు అరవింద్.

గతంలో కూడా మితిమీరిన విధంగా గొడవ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓపెన్ గా తిట్టి కంట్రోల్ చేశారు నాగబాబు. ఇప్పుడు కూడా ఆయనకే పగ్గాలు అప్పజెప్పడంతో అసలు ఆయన తిడతారా లేకపోతే బన్నీ ని వదిలేయండి అంటూ సముదాయిస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. కాని నాగబాబు మాత్రం.. అసలు ప్రతీ ఫంక్షన్ లో ఇలా ''పవర్ స్టార్'' అంటూ ఎందుకు గొడవ చేస్తున్నారు అనే అంశంపై ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. పైగా వీళ్లు కావాలని ఇలా పవర్ స్టార్ అరవడం వెనుక ఏమైనా కాన్సిపిరసీ ఎలిమెంట్లు పనిచేస్తున్నాయా అని కూడా ఆయన కూపీ లాగనున్నారట.

లేకపోతే పవన్ రాని ఫంక్షన్ లో.. ఎక్కడో బన్నీ ఒక ఈవెంట్ చేసుకుంటుంటే.. ఆ ఈవెంట్ లో పవన్ గురించి మాట్లాడమనడం ఏంటి అనేది ఆయన ప్రశ్నగా తెలుస్తోంది. చూద్దాం ఏమవుతుందో

,  ,  ,  ,  ,  ,