Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2017 14:13:54
facebook Twitter Googleplus
Photo

పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పెద్ద అండగా నిలిచాడు నాగబాబు. ఐతే ఆ తర్వాత ఆ పార్టీ మూతపడింది. 2014 ఎన్నికల సమయానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే.. మెగా అభిమానులు అన్నయ్య వైపే ఉండాలని.. కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వాలని పిలుపు ఇచ్చాడు నాగబాబు. ఐతే ఈ మధ్య ఆయన స్వరం మారింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతుగా మాట్లాడుతున్నాడు. జనసేనకు జై కొడుతున్నాడు. కానీ నాగబాబు బయటే ఉండి తమ్ముడికి.. తమ్ముడి పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు తప్ప ఆ పార్టీలోకి రావడం లేదు. ఐతే పవన్ పిలిస్తే తాను తప్పకుండా ఆ పార్టీలోకి వచ్చి పని చేస్తానని నాగబాబు ప్రకటించాడు.

ఇప్పటిదాకా పవన్ తనను జనసేనలోకి పిలవకపోవడానికి నాగబాబు కారణం చెప్పాడు. తన జీవితంలో తాను పెద్ద కష్టాలు చూశానని.. అది పవన్ కూడా చూశాడని.. ఇకపై తాను అంత కష్టపడనక్కర్లేదన్న భావనతోనే పవన్ తనను జనసేనలోకి పిలవలేదని భావిస్తున్నట్లుగా నాగబాబు చెప్పాడు. ఆరెంజ్ సినిమాతో తాను కష్టాల్లో పడ్డపుడు పవన్ తనను ఎంతో ఆదుకున్నాడని నాగబాబు చెప్పాడు. తాను పార్టీలోకి వస్తే పవన్ కు ప్లస్ కాకున్న పర్వాలేదు కానీ మైనస్ కాకూడదని తాను ఆలోచిస్తున్నట్లు నాగబాబు చెప్పాడు. తనకు పదవులు అక్కర్లేదని.. పవన్ పిలిచి పని చేయమంటే ఓ కార్యకర్తగా కూడా పని చేస్తానని నాగబాబు అన్నాడు.

,  ,  ,  ,  ,  ,