Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 10:29:03
facebook Twitter Googleplus
Photo

నాగార్జున కొత్త సినిమాపై ఇప్పుడు ప్రకటన వచ్చేసింది. రాజుగారి గది2 ప్రచారంలో ఉన్న నాగ్.. తన మరుసటి మూవీపై అఫీషియల్ గానే చెప్పేశారు. నిజానికి ప్రస్తుతం తను ఫినిష్ చేసిన రాజుగారి గది సీక్వెల్ మినహాయిస్తే.. నాగ్ మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. కొన్ని నెలల పాటు షూటింగ్స్ లేకపోవడంతోనే.. లుక్ విషయంలో ప్రయోగం చేసేందుకు మీసం కూడా తీసేసి క్లీన్ షేవ్ లోకి మారినట్లు చెప్పారు నాగ్.

అయితే.. గత కొన్ని రోజులుగా నాగార్జన ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారనే రూమర్ వినిపిస్తోంది. భలే మంచి రోజు.. శమంతకమణి చిత్రాలకు దర్శకత్వం వహిచిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో.. నానితో కలిసి నాగార్జున ఓ సినిమా చేయనున్నారనేది ఆ రూమర్ సారాంశం. బడా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇప్పుడీ రూమర్స్ అన్నిటినీ ఖాయం చేస్తూ.. తాను నానితో కలిసి నటిస్తున్నానని.. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు కూడా వెల్లడవుతాయని చెప్పారు నాగార్జున.

ఈ సినిమాలో నాని పాత్ర చాలా బాగుంటుందని.. తన కేరక్టర్ కూడా సూపర్బ్ గా అభిమానులను అలరించేలా ఉంటుందని చెప్పారు నాగ్.

,  ,  ,  ,