Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 10:46:30
facebook Twitter Googleplus
Photo

మోస్ట్ బ్యూటిఫుల్ ప్రేమ జంట అక్కినేని నాగ చైతన్య - సమంత మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి కోసం ఇప్పటికే ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. అక్టోబర్ 6 - 7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం గోవాలో జరగనుంది. ఈ సందర్బంగా నాగార్జున కాబోయే వధూవరులకు ఒక విషయాన్ని చెప్పారు. అంతే కాకుండా పెళ్లి గురించి కూడా కొన్ని విషయాలను బయటపెట్టారు.

''ముందుగా నాగ చైతన్యకి మరియు అతనికి కాబోయే భార్యకు ఒకేటే చెప్పాను. ప్రతి పరిస్థితులు అర్ధం చేసుకొని నేను చెప్పిన విధంగా అర్ధం చేసుకొని నడుచుకోవాలని అన్నాను'' అంటున్నారు నాగ్. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''ఈ పెళ్లికి కేవలం 100 మంది అతిధులకు మాత్రమే ఇన్విటేషన్స్ ఇచ్చాము. నాగ చైతన్య - సమంత హిందూ - క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకోబోతున్నారు. కేవలం దగ్గరి బంధువులు మరియు క్లోజ్ ఫ్రెండ్స్ - వెల్ విషర్స్ మాత్రమే హాజరవుతారు'' అని నాగ్ తెలిపారు.

అయితే ఇన్ని రోజులుగా 150 మంది అతిధులు వస్తారని వార్తలు వచ్చాయి. కానీ నాగ్ చెప్పిన విధంగా చూసుకుంటే టాలీవుడ్ లో ఓ నలుగురి హీరోలు వచ్చేట్లు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక రిసెప్షన్ ని హైదరాబాద్ లో నిర్వహించి టాలీవుడ్ లో ప్రముఖులందరిని పిలిపించే ఆలోచనలో నాగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,