Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 10:57:00
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున - అందాల స్వీటీ అనుష్కలకు ర్యాపో ఎక్కువ. స్వీటీ సినిమాలో ఉంటే.. ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ నాగార్జునకు ఉంది. అందుకే ఓ చిన్న కేరక్టర్ అయినా సరే సృష్టించి మరీ అనుష్కను తెచ్చుకుంటూ ఉంటాడు. సోగ్గాడే చిన్ని నాయన - ఊపిరి చిత్రాల్లో అనుష్క పాత్రలు ఇలాగే పుట్టాయి.

అలాగని నాగ్ - అనుష్కల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ ఏమీ కాదు. సూపర్ తో మొదలై - డాన్ - రగడ - ఢమరుకంలలో నటించిన అనుష్క.. కేడీ - కింగ్ లలోనూ నటించింది. వీటిలో కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయినా సరే అనుష్కపై మాత్రం కింగ్ సెంటిమెంట్ సడలలేదు. అందుకే ఇప్పుడు తన తర్వాతి చిత్రంలో కూడా అనుష్కను తోడు తెచ్చుకుంటున్నాడు నాగార్జున. ప్రస్తుతం నాగ్ ఓ భక్తిరస చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు రూపొందించనున్న ఓ నమో వెంకటేశా చిత్రంలో.. శ్రీనివాసుడు భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు నాగ్.

ఇప్పుడీ సినిమాలో అనుష్కకు ఓ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇఫ్పటికే ఈ రోల్ కోసం స్వీటీని అడగడం ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ అందడం కూడా జరిగిపోయాయి. ఈ మూవీలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ను ఇప్పటికే ఓ హీరోయిన్ గా ఎంచుకోగా.. ఇప్పుడు స్వీటీ కూడా తోడయ్యింది

,  ,  ,  ,  ,