Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2016 11:48:03
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు శరవేగంగా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమైంది. చందు మొండేటి డైరెక్షన్ లో చేసిన 'ప్రేమమ్' కూడా ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది.

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా తెలుగులో అదే పేరుతో తెరకెక్కింది ప్రేమమ్. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లో నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇంతటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాకి.. ఇప్పుడు మరింత ఆకర్షణలు జోడిస్తున్నారు. ఇందులో కథను నేరేట్ చేసే వాయిస్ ఓవర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ బాధ్యతను నాగ చైతన్య తండ్రి టాలీవుడ్ కింగ్ నాగార్జున స్వయంగా టేకప్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

చైతు చిత్రానికి నాగ్ వాయిస్ చెప్పడమంటే.. ఖచ్చితంగా ఆసక్తి కలిగించే విషయమే. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఇదో థ్రిల్లింగ్ ఎలిమెంట్ లా ఉండాలని యూనిట్ భావిస్తోందట. అసలే బ్లాక్ బస్టర్ కి రీమేక్ - పైగా ముగ్గురు హీరోయిన్లు - దీంతోపాటు వరుస మూడు హిట్స్ కొట్టిన నాగ్ వాయిస్ ఓవర్.. ప్రేమమ్ స్పెషాలిటీస్ తలుచుకుంటేనే.. అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.

,  ,  ,  ,  ,  ,