Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 16:45:21
facebook Twitter Googleplus
Photo

నాగార్జున చేసిన నాటీ కామెంట్లపైనే పడుతున్నాయి. 'రాజు గారి గది 2' సినిమాను చాలా యాక్టివ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ సీనియర్ హీరో.. ఆ సినిమాలో తన కోడలుతో కలసి నటిస్తున్న విషయమై పలు ఆసక్తికరమైన అంశాలను రివీల్ చేశాడు. అందులో భాగంగా.. సమంత ఈ సినిమాలో కేవలం 20 నిమిషాలు కనిపిస్తుందని.. కాకపోతే కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పాడు. అప్పుడే మరో కామెంట్ కూడా చేశాడండోయ్.

నిజానికి ఈ సినిమాలో సమంత ఒక దెయ్యంగా కనిపించనుంది కదా.. మరి దాన్ని చూసి మీరు తట్టుకోగలరా అంటే.. 'అవును.. సమంతను దెయ్యంగా చూడడం కాస్త కష్టమే. కాకపోతే తన పెర్ఫామెన్స్ అదిరిపోతుంది. అయితే ఇదే విషయాన్ని చైతూతో చెబితే.. వాడు సినిమా చూడను అన్నాడు. అసలే ఇద్దరూ పెళ్లయ్యాక ఒకే గదిలో కలసి కాపురం చేయాలి కాబట్టి.. సినిమా చూసే యోచన లేదని చెప్పేశాడు. పైగా దెయ్యంగా సమంతను అస్సుల ఊహించుకోలేను అని చెప్పాడు'' అంటూ నాగ్ కామెంట్ చేశారు. ఎలాగైనా ఒకే గదిలో ఉండడం కాస్త కష్టమేలే అంటూ నాగ్ జోక్ చేశారు కూడా.

మొత్తానికి పెళ్ళికి ముందు సమంత చేసిన సినిమా.. పెళ్ళి తరువాత తొలిసారిగా రిలీజ్అవుతున్న ఆమె తెలుగు సినిమా.. అయినప్పటికీ చైతన్య ఆ సినిమాను చూడలేను అని చెప్పడం.. కాస్త విడ్డూరమే.

,  ,  ,  ,  ,