Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 15:09:46
facebook Twitter Googleplus
Photo

అఖిల్ సెకండ్ మూవీ కోసం ఓ వర్గం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం చాలా టెన్షన్ తో ఉంది. సినిమా మీద నమ్మకం ఉన్నా కూడా అది ఆడీయన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనే చిన్న సందేహంలో టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇకపోతే సినిమాపై ఎలాంటి నెగిటివ్ న్యూస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నాగార్జున అఖిల్ హలో కోసం తన శక్తిని మొత్తంగా ఉపయోగించి ప్రణాళికలని రూపొందిస్తున్నాడు.

సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా పిఆర్ టీమ్ తో కలిసి చర్చలు కూడా జరుపుతున్నాడు. అయితే రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా కాపీ రైట్స్ ఇష్యు వల్ల హలో టీజర్ యూట్యూబ్ టీజర్ ఎగిరిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరికి మొదటి నుంచి ఉన్న అనుమానంపై క్లారిటీ వచ్చింది. టీజర్ లో ఎదో కాపీ జరిగిందనే టాక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. లైవ్ అయ్యేంత వరకు సోషల్ మీడియాలో నాగార్జున ఇష్యుపై చిన్న వివరణ కూడా ఇవ్వలేదు. అఖిల్ మాత్రం చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

టీజర్ మాయమవ్వడం ఏంటి.. ఫారిన్ కంపెనీవారితో మేం డిజైన్ చేయించుకున్న సౌండ్ చాలా బావుంది అంటూ కవర్ చేశాడు. కానీ అంత జరిగినా పిఆర్ టీమ్ పట్టించుకోకపోవడం గమనార్హం. ఎదో ఒక న్యూస్ తో వారు మ్యాటర్ ని వైరల్ చేయకుండా కేర్ తీసుకోవాల్సింది కానీ వారు లెక్క చేయకపోవడంతో వారిపై నాగ్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలే ఈ రోజుల్లో కాపీ అనే పదం చాలా వైరల్ అవుతోంది

,  ,  ,  ,  ,  ,