Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 13:52:39
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేస్తున్నాడు. అంతే స్పీడ్ గా రిలీజ్ లు కూడా చేసేస్తున్నాడు. నందినీ రెడ్డి కళ్యాణ వైభోగమే తర్వాత.. మెగా డాటర్ తో చేసిన ఒక మనసు చిత్రాన్ని కూడా రిలీజ్ చేసిన నాగశౌర్య.. ఇప్పుడు డిఫరెంట్ జోనర్ లోకి ఎంటర్ అవుతున్నాడు.

తన కెరీర్ లో తొలిసారిగా ఓ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశార్య. హుస్సేన్ షా కిరణ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మొదట మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని తీసిన హుస్సేన్ షా కిరణ్ .. నాన్నకు ప్రేమతో సినిమా కథ అందించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ విషయం స్వయంగా చెప్పి స్టేజీ మీద ఇతన్ని సుకుమార్ పరిచయం చేశాడు.

గీతా ఆర్ట్స్ సంస్థ మీకుమీరే మాకుమేమే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ట్రై చేసింది. అయినా సరే ఈ హుస్సేన్ తొలి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం నాగశౌర్యతో చేయనున్న థ్రిల్లర్ కు వేదాంతం అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఇప్పటివరకూ నాగశౌర్య కనిపించనంత న్యూ లుక్ తో పెర్ఫామెన్స్ తో ఈ వేదాంతం ఉంటుందని చెప్పాడు దర్శకుడు హుస్సేన్ షా కిరణ్.

,  ,  ,  ,  ,  ,