Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:33:03
facebook Twitter Googleplus
Photo

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రం తెరకెక్కుతోంది. చాలా కాలంగా ఈ సినిమాని తీస్తున్నారు కానీ.. ఇంకా కంప్లీట్ కాలేదు. తమిళ్ లో శింబు తెలుగులో చైతు హీరోలుగా ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బోలెడన్ని అవాంతరాల స్పీడ్ గా షూటింగ్ చేస్తున్న సమయంలో శింబు వివాదం మరోసారి చుట్టుముట్టింది. దీంతో మళ్లీ మూలన పడి.. కొన్నాళ్ల క్రితం తిరిగి పట్టాలెక్కింది ఈ చిత్రం. రెండు భాషల్లోన మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. అయితే.. ఈ మూవీపై లేటెస్ట్ గా వచ్చిన అప్ డేట్ ఏంటంటే.. నాగ చైతన్య ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. నిజంగా ఇది షాకింగ్ అంటే షాకింగ్ న్యూస్ అనాల్సిందే. చైతు ఇఫ్పటివరకూ పోలీస్ పాత్రలో ఎప్పుడూ కనిపించలేదు. దీంతో సాహసం స్వాసగా సాగిపో చిత్రంలో ఇదే ప్రధాన ఆకర్షణ కానుంది.

గౌతమ్ మీనన్ పోలీస్ పాత్రలను చాలా పర్ఫెక్ట్ గా తీర్చుదిద్దుతాడనే పేరుంది. పవర్ ఫుల్ పోలీస్ లను చూపడంలో ఈ దర్శకుడు సిద్ధహస్తుడు. మరి ఈ చిత్రంలో నాగ చైతన్యను ఏ రేంజ్ లో చూపించనున్నాడనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాబా సెహగల్ విలన్ రోల్ పోషిస్తుండగా.. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. మే నెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

,  ,  ,  ,  ,  ,