Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 11:16:33
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ అయిపోయిన నాని.. స్పీడ్ అలా ఇలా లేదు. మరో నాలుగు రోజుల్లో ఈ హీరో నటించిన మజ్ను థియేటర్లలోకి వస్తుండగా.. ఈ ఏడాది ఇది మూడో రిలీజ్. జ్యో అచ్యుతానంద గెస్ట్ రోల్ కలిపితే నాలుగు అవుతుంది. ఇప్పటికే మజ్నుపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా.. సక్సెస్ విషయంలో నాని కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. 2016లోనే మరో సినిమా నేను లోకల్ ని కూడా విడుదల ఛాన్స్ ఉండగా.. తన డ్రీమ్ రోల్ ఏంటో ఇప్పుడు రివీల్ చేసేశాడు నాని.

ఇప్పటివరకూ తను నటించిన అన్ని సినిమాలు నటుడిగా శాటిస్ఫై చేసినా.. ఒక డ్రీమ్ రోల్ మాత్రం ఉండిపోయిందట. హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ టైపులో.. ఓ సినిమాను.. రోల్ ను చేయాలన్నది నాని కోరిక. ఈ విషయాన్ని స్వయంగా చెప్పేసిన నాని.. గతంలో తాను ఈ మాట చెబితే అందరూ నవ్వేసేవారని.. కాని ఇప్పుడు బాహుబలి అండ్ రాజమౌళి పుణ్యమా అని ఆ పరిస్థితి లేదని చెబుతున్నాడు. తీయగలిగే సత్తా ఉంటే.. తెలుగులో వార్ బేస్డ్ గా నడిచే సినిమాలకు ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో బాహుబలి ప్రూవ్ చేసిందన్నది నాని చెబుతున్న మాట.

తన డ్రీమ్ రోల్ ను ఏదో ఒక రోజున చేసే ఛాన్స్ వస్తుందని నమ్మకంగా చెబుతున్న చెబుతున్న ఈ నేచురల్ స్టార్ ని చూసి.. వార్నాయనో అనేందుకు బదులుగా.. వార్ నానినో అనుకుంటున్నారు చాలామంది సినీ జనాలు. అయితే ప్రస్తుతానికి నాని డ్రీమ్ రోల్ చేయాలంటే మాత్రం.. సదరు సినిమాను రాజమౌళియే చేయాలి. జక్కన్న సార్ వింటున్నారా..?

,  ,  ,  ,  ,  ,