Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 10:13:24
facebook Twitter Googleplus
Photo

నాని చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నట్లుంటాడు కానీ.. చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. నొప్పించక తానొవ్వక అన్నట్లుంటుంది అతడి మాటతీరు. ఐతే ఈ మధ్య నాని తెలిసో తెలియకుండానో కొందరికీ పంచులు వేసేస్తున్నాడు. నేను లోకల్ ఆడియో వేడుక సందర్భంగా దిల్ రాజు ప్రొడక్షన్లో కష్టమంతా వేరేవాళ్లది పేరంతా రాజు కొట్టేస్తాడంటూ సరదాగానే ఆయన మీద నాని వేసిన పంచ్ చర్చనీయాంశమైంది. తాజాగా వారసుల నిలయమైన టాలీవుడ్లో ఆ హీరోలకు గట్టిగా తగిలేలా ఒక పంచ్ వేశాడు నాని.

తన కొత్త సినిమా ?నేను లోకల్? ప్రమోషన్లలో భాగంగా నాని మాట్లాడుతూ.. తనకు బ్యాగ్రౌండ్ లేదని కొందరు అంటుంటారని.. కానీ దాన్ని తానో వరంగా భావిస్తానని చెప్పాడు. తన దగ్గరికి ఎవరైనా వచ్చిన ?నేను మీ ఫ్యాన్ అంటే.. అతను కచ్చితంగా తన ఫ్యానే అని గర్వంగా ఫీలవుతానని అన్నాడు నాని. అంటే వారసులకు సంబంధించిన అభిమానుల్లో చాలామంది వాళ్ల నాన్నలకు ఫ్యాన్స్ అయి ఉంటారన్నది నాని మాటల ఆంతర్యం అని స్పష్టమైపోతోంది. నాని నిజంగా ఈ ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడో లేదో కానీ.. ఆ వ్యాఖ్యలు మాత్రం వారసులకు సూటిగా తగులుతాయనడంలో సందేహం లేదు. నాని అక్కడితో ఆగకుండా నిజమైన హిట్ అంటే లైట్ బాయ్ దగ్గర్నుంచి డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు అందరికీ సంతోషాన్ని తెచ్చిపెట్టేదే అన్నాడు. కొన్నిసార్లు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తెచ్చిపెడతాయని.. అలాంటివి నిజమైన హిట్లు కావంటూ భారీ బడ్జెట్ సినిమాలపై పరోక్షంగా సెటైర్ వేశాడు నాని.

,  ,  ,  ,  ,