Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 16:02:43
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో రేంజ్ నుంచి నేచురల్ స్టార్ గా మారిన నాని.. ఇప్పుడు జోష్ పెంచాడు. సినిమాలు కూడా వరుసగా రిలీజ్ లు చేస్తున్నాడు. ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఇప్పుడు జెంటిల్మన్ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. నాని కెరీర్ లో భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ కూడా మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ లో బాలయ్య అభిమానులది కీలక పాత్ర..

బాలకృష్ణకు అభిమానిగా నటించిన నాని.. చేతిపై జై బాలయ్య ట్యాటూతో సందడి చేశాడు. ఇప్పుడు జంటిల్మన్ చిత్రం కోసం కూడా బాలయ్యని ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తోంది. హీరో - విలన్.. ఇలా రెండు షేడ్స్ ఉన్న రోల్ ని చేస్తున్న నాని.. జెంటిల్మన్ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయడానికి రెడీ అయ్యాడు. ఆ రోజు నందమూరి నటసింహం పుట్టినరోజు కావడమే అసలు రీజన్. అనుకోకుండా ఆ డేట్ సెట్ అయిందా.. కావాలనే బాలయ్య బర్త్ డేని సెట్ చేశారా అంటే.. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగానే ఆ డేట్ కి ఫిక్స్ అయ్యామని ఒప్పుకుంటున్నారు జంటిల్మన్ దర్శక నిర్మాతలు.

నానిని హీరోగా అష్టా చమ్మాతో పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. ఆ తర్వాత నానితో కలిసి చేస్తున్న మూవీ ఇదే కావడంతో.. ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సురభి - నివేదితా థామస్ లు జంటిల్మన్ లో నానికి జంటగా నటించారు

,  ,  ,  ,  ,  ,  ,