Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 11:16:25
facebook Twitter Googleplus
Photo

ఇవాళ నాని నటించిన నేను లోకల్ మూవీ రిలీజ్. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించేసుకున్న నాని.. నేచురల్ స్టార్ అని ఫ్యాన్స్ తో పిలిపించుకుంటున్నాడు. మినిమం గ్యారంటీకి మించి ట్రేడ్ వర్గాల్లోను.. ప్రొడ్యూసర్లలోను పేరు సంపాదించుకున్నాడు. అలాంటి నానికి.. సినిమా రిలీజ్ సందర్భంగా భారీ కటౌట్ పెట్టడం పెద్ద వింతేమీ కాదు. కానీ.. ఈ విషయంలో నాని బాగా ఫీలైపోయాడు.

తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్ల దగ్గరే నానికి భారీ కటౌట్లు వెలిశాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర.. ఆ థియేటర్ కంటే పొడవైన కటౌట్ పెట్టారు ఫ్యాన్స్. ఈ ఫోటోను పోస్ట్ చేసిన నాని.. 'చిన్నపుడు చాలా సినిమాల కోసం ఆ కటౌట్ కి పాదాల దగ్గర ఉన్నాను. ఇప్పుడు జీవితం నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. మీరు లేకుండా నేను లేను. దీన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను.. ప్రామిస్' అంటూ కామెంట్ చేశాడు నాని.

స్టార్ స్టేటస్ వచ్చాక కటౌట్స్ పెట్టడం కామన్ అయినా.. నాని దానికి స్పందించిన తీరు మాత్రం సూపర్బ్ అంతే. తాను చిన్న స్థాయి నుంచి.. అభిమానుల అండదండలతోనే ఈ రేంజ్ కు చేరుకున్నానంటూ.. నాని థ్యాంక్స్ చెప్పిన తీరును అద్భుతం అనాల్సిందే. ఒక్క కామెంట్ తో అందరి హృదయాలను టచ్ చేసేశాడంతే.

,  ,  ,  ,  ,