Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 11:14:06
facebook Twitter Googleplus
Photo

వరుసగా హిట్స్ కొట్టేస్తూ నేచురల్ స్టార్ నాని మహా ఊపుమీదున్నాడు. తెగ స్పీడ్ గా సినిమాలు రిలీజ్ కి రెడీ చేసేస్తుండడం.. ఓ మూవీ రిలీజ్ అయ్యే టైమ్ కి మరో సినిమాని సగానికి పైగా సిద్ధం చేయడంతో.. ఈ స్పీడ్ బాగా పెరిగిపోతోంది. ఈ ఏడాది ఇప్పటికి 3 సినిమాలు విడుదల కాగా.. మరో మూవీ నేను లోకల్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయిపోనుందని తెలుస్తోంది. అయితే.. ఈ స్పీడ్ వసూళ్ల దగ్గర మాత్రం తేడా వస్తోంది.

భలేభలే మగాడివోయ్ నుంచి నాని క్రేజ్ ఓవర్సీస్ లో బాగా పెరిగింది. అసలు నాని రేంజ్ పెరిగిపోవడంలో.. ఓవర్సీస్ వసూళ్లు కీలక పాత్ర పోషించాయి. మూడో వంతు కలెక్షన్స్ ను భలే భలే మగాడివోయ్ ఇక్కడి నుంచే రాబట్టడం.. 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించడంతో.. తర్వాత సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్మన్ చిత్రాలు 7లక్షల డాలర్లు వసూలు చేసి పర్లేదనిపించినా.. ఇప్పుడు మజ్ను మాత్రం హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరే ఆగిపోతోంది.

అసలు మజ్ను ఓపెనింగ్స్ అయితే వీర లెవెల్లో వచ్చాయి. కానీ సెకండాఫ్ నిరాశపరచడం.. కొత్తగా ప్రెజెంట్ చేసినది ఏమీ లేకపోవడంతో.. మజ్ను సేఫ్ వెంచర్ కాలేకపోతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సిట్యుయేషన్ పర్లేదనిపిస్తున్నా.. ఓవర్సీస్ లో మాత్రం మజ్నుకి నష్టాలు తప్పడం లేదు. ఇక నుంచైనా ఇలాంటి లోటు పాట్ల విషయంలో నాని దృష్టి పెట్టకపోతే.. ఇలా వసూళ్ల అడుగులు వెనక్కి పడక తప్పదు.

,  ,  ,  ,  ,  ,