Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 16:50:23
facebook Twitter Googleplus
Photo

నాని హీరోగా ఇటీవల విడుదలైన మజ్నూ చిత్రం ఫర్వాలేదు అనిపించుకుంది. ఇంతవరకూ కాస్త లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వెరైటీ పాత్రల్లో కనిపించిన నాని... ఇప్పుడు కాస్త మాస్ టచ్ ఇవ్వబోతున్నట్టున్నాడు. ?నేను లోకల్? అంటున్నాడు నాని. ప్రస్తుతం నాని చేస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. నాని స్టిల్ చూస్తుంటే ఈసారి ఓ మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టున్నాడు. రాబోయే చిత్రంలో నాని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే క్లారిటీ స్వయంగా తానే ఇచ్చేశాడు. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు బాబు! మనోడికి చదువు నిల్.. యాటిట్యూడ్ మాత్రం ఫుల్. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా అదే... ?యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీతింగ్?. బాబుగాడి బిహేవియర్ కూడా మాసీగానే ఉండబోతోందని ఈ ట్యాగ్ లైన్ చూస్తుంటేనే అర్థమైపోతోంది.

తన ట్వీట్ ద్వారా బాబు పాత్రను పరిచయం చేశాడు నాని. తన పాత్రకి సంబంధించి ప్రొఫైల్ ఎలా ఉంటుందో ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పాడు. పేరు : బాబు - క్వాలిఫికేషన్ : నిల్ - యాటిట్యూడ్ : ఫుల్ - ఆ తరువాత ?నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా? అంటూ ఓ లైన్ రాశాడు. సో... నక్కిన త్రినాథరావు దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ఎలా ఉండబోతున్నాడో అనేది క్లియర్. దర్శకుడు త్రినాథరావు గత చిత్రం రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ?సినిమా చూపిస్తమామ?. ఆ సినిమా కథాకథనాలు ఏమంత కొత్తవి కాకపోయినా... మాస్ ఎలిమెంట్స్ కి కాస్త కామెడీ టచ్ ఇవ్వడం ద్వారా ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు నానిని కూడా మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడీ దర్శకుడు. మరి నక్కిన-నాని జోడీలో వస్తున్న ఈ లోకల్ బాబు... మన లోకల్ ఆడియన్స్ ను ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

,  ,  ,  ,