Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:53:42
facebook Twitter Googleplus
Photo

నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ?ఎవడే సుబ్రమణ్యం? నుంచి మొదలుకొని గత నెలలో విడుదలైన ?జెంటిల్‌మన్? వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడిపోయారు. ?ఉయ్యాల జంపాల? సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ, తన రెండో సినిమా కోసం చాలాకాలం కథపైనే దృష్టి పెట్టి ఈమధ్యే నానితో ఈ సినిమాను మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ భీమవరం ప్రాంత పరిసరాల్లో జరుగుతోంది. ఇక కథరీత్యా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాల్లో నాని, మహేష్ హీరోగా నటించిన ?దూకుడు? సినిమాకు వెళతారట. ఇక ఇందుకు సంబంధించి దూకుడు పోస్టర్స్‌తో ఓ థియేటర్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతూ ఉండడం అక్కడి వారిని ఆకర్షిస్తోంది. నానిని చూడడానికి భీమవరం ప్రాంత యువకులు పెద్ద సంఖ్యలో షూటింగ్ లొకేషన్‌కు వస్తున్నారట. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,