Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 15:47:14
facebook Twitter Googleplus
Photo

హీరో నాని ఇప్పుడు తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. నేచురల్ స్టార్ ఉన్నాడంటే చాలు.. మినిమం వసూళ్లు.. లాభాలు వచ్చేస్తున్నాయి. సాఫ్ట్ స్టోరీలతోనే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం'నేను లోకల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 3న నేను లోకల్ మూవీ విడుదల కాగానే.. కొత్త సినిమా మొదలుపెట్టేయనున్నాడు నాని.

నేను లోకల్ విడుదలయ్యాక 2-3రోజులు ప్రమోషన్స్ చేసి.. కొత్త దర్శకుడు శివ నిర్వానంద్ తీయనున్న మూవీని మొదలుపెట్టేస్తాడు. ఈ మూవీలో హీరోయిన్ గా జెంటిల్మన్ లో నటించిన నివేదా థామస్.. నానితో మరోసారి జత కట్టనుంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రాన్ని.. ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ చేయనుండగా.. ఫిబ్రవరి మొదటివారంలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. స్టోరీ ప్రకారం మెజారిటీ పార్ట్ అంతా అక్కడే పిక్చరైజ్ చేయనున్నారట. అందుకే నానితో పాటు మొత్తం యూనిట్ అంతా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ అంతా అయిపోయాక.. హైద్రాబాద్-వైజాగ్ లలో కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉంటుందట.

సరైనోడులో విలన్ గా మెప్పించిన ఆది పినిశెట్టి.. మరోసారి నానికి ప్రత్యర్ధిగా కనిపించనున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి నిర్మాత డీవీవీ దానయ్య. నేను లోకల్ రిలీజ్ కాగానే.. అలా ఫ్లైట్ ఎక్కేసి అమెరికాలో ల్యాండ్ అయిపోనున్నాడు నాని.

,  ,  ,  ,  ,