Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:04:50
facebook Twitter Googleplus
Photo

ఏ రంగంలోనైనా కష్టపడితే దాని ఫలితం వెతుక్కుంటూ వస్తూనే వుంటుంది. చిత్రపరిశ్రమకి సంబంధించి ఈ విషయాన్ని మరోమారు నిరూపించినవాడిగా 'నాని' కనిపిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన 'భలే భలే మగాడివోయ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాకి మారుతి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. నాని మంచి కథానాయకుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఆయన సినిమాలు అభిమానులను ఉత్సాహపరిచినా, ఆశించిన స్థాయిలో ఆయనని అవకాశాలు పలకరించలేదు. అయితే కథల విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమా తరువాత నాని మరో పెద్ద బ్యానర్ లో నటించనున్నాడు. ఈ సినిమాల్లో ఏది ఆశించిన స్థాయిలో విజయవంతమైనా నాని దూకుడిని ఆపడం కష్టమేనని చెప్పొచ్చు.

,  ,  ,  ,