Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 11:03:11
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని మహా స్పీడ్ అనే విషయం కనిపిస్తూనే ఉంది. ఈ ఏడాది మొదలై 9 నెలలు గడిస్తే.. ఈటైమ్ లోనే 3 హిట్స్ కొట్టేసి.. ఇదే ఏడాది ఇంకో సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న నాని కంటే వేగంగా.. ఇప్పుడెవరకూ సినిమాలు చేయడం లేదు. స్పీడ్ తో పాటు సక్సెస్ లు కూడా కొట్టేయడం ఈ నేచురల్ స్టార్ అసలు సిసలైన స్పెషాలిటీ.

ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుపెడితే.. భలేభలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జెంటిల్మన్.. మజ్నులతో కంటిన్యూగా ఐదు హిట్స్ కొట్టేసి.. డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసేందుకు డిసెంబర్ లో నేను లోకల్ ను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నాని మరో రెండు సినిమాలకు సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. శ్రీరస్తు శుభమస్తు దర్శకుడు పరుశురాం కి అసిస్టెంట్ అయిన శివను.. డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు నాని.

దీంతోపాటే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరుశురాం డైరెక్షన్ లో సినిమా చేసేందుకు సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. శివతో సినిమా పూర్తయ్యాక.. పరుశురాం మూవీని పట్టాలెక్కించనున్నాడు. అయితే.. పరశురాం కంటే ముందే అతని అసిస్టెంట్ నానితో సినిమా చేసేసే ఛాన్స్ దక్కించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

,  ,  ,  ,  ,