Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 11:51:54
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మన్ రిలీజ్ కి మరొక్క రోజు మాత్రమే టైం ఉంది. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న స్కూల్స్.. వీకెండ్ వచ్చేయడం.. నాని లాంటి ఫ్యామిలీ హీరో సినిమా కావడంతో.. ఓపెనింగ్స్ పై బాగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం జెంటిల్మన్ ప్రమోషన్స్ లో ఉన్న నాని.. కోలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పాడు.

నిజానికి నాని తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు తమిళ్ సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడట. 'ఆహా కళ్యాణం తర్వాతే నేను ఈ నిర్ణయానికొచ్చాను. ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయినా.. నా లిప్ సింకింగ్ చాలా వరస్ట్ గా ఉందని చాలామంది చెప్పారు. అది డబ్బింగ్ సినిమా మాదిరిగా కనిపించింది. తమిళ్ మూవీస్ చేయడం నా కెరీర్ కు ప్లస్ అవుతుందనే ఫీలింగ్ నాకు పోయింది. అయితే.. బై లింగ్యువల్స్ మాత్రం చేస్తాను. తెలుగులో చేసే సినిమా తమిళ్ లో కూడా చేస్తానంతే' అని చెప్పాడు నాని.

మణి రత్నం - గౌతమ్ మీనన్ లాంటి దిగ్గజాలతో చేయాలనే ఉద్దేశ్యంతోనే తమిళ్ వైపు చూశానంటున్నాడు నాని. అయితే.. తమిళ్ స్క్రిప్టులతో తనకు - తన కెరీర్ కు ఒరిగేదేం లేదని అర్ధమయ్యాక కోలీవుడ్ కి దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాడట. తన కెరీర్ లో ఎదుర్కున్న ఒడిదుడుకుల్లో భాగంగా ఈ పాఠం కూడా నేర్చుకున్నా అంటున్నాడు నాని.

,  ,  ,  ,