Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2017 11:43:53
facebook Twitter Googleplus
Photo

ఆడియన్స్ కు దగ్గరైన హీరో నారా రోహిత్. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏ హీరోలు అయినా.. మాంచి మాస్ మూవీతో పాతుకుపోయేందుకు ట్రై చేస్తుంటారు. కానీ నారా రోహిత్ మాత్రం.. తనదైన శైలితో విభిన్నమైన సినిమాలు చేసి.. ప్రేక్షకులకు దగ్గరయ్యి.. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓ మాస్ చిత్రంలో నటిస్తున్నాడు.

బాలకృష్ణుడుగా వస్తున్న నారా రోహిత్ మూవీపై.. మొదటగా ఆసక్తిని విపరీతంగా పెంచేసిన పాయింట్.. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్. వీటిలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరికీ భలే షాక్ ఇచ్చాడు. బొద్దు హీరో అనిపించుకుని.. తర్వాతి సినిమాకి గ్యారంటీగా తగ్గుతానని కొన్నేళ్ల నుంచి చెప్పి మాట తప్పుతున్న రోహిత్.. ఒక్కసారిగా చెప్పాపెట్టకుండా ఇలా మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ రకంగా చూస్తే.. బాలకృష్ణుడు మూవీలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ చూపిస్తాడని ఆశించడంలో ఆశ్చర్యంలేదు.

కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం.. బాలకృష్ణుడులో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ ఉండదట. కేవలం సన్నబడ్డ ఈ యంగ్ హీరో కనిపిస్తాడంతే. ఒకవేళ సిక్స్ ప్యాక్ ను ఆన్ స్క్రీన్ పై చూపించకపోయినా.. నారా రోహిత్ నిజంగా సూపర్ ఫిజిక్ లోకి మారిపోయిన మాట అయితే మాత్రం వాస్తవమే.

,  ,  ,  ,  ,