Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 14:17:05
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్‌కి పాపం ఏం చేసినా కానీ కలిసి రావడం లేదు. కొత్తరకం కథలతో చేసిన ప్రయత్నాలన్నీ ప్రశంసలతో సరిపెట్టుకోవడంతో కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఫార్ములా సినిమాలు కూడా అటెంప్ట్‌ చేసాడు. గత కొన్ని వారాల్లోనే అతని సినిమాలు రెండు రిలీజ్‌ అయ్యాయి. కానీ తుంటరి, సావిత్రి రెండూ కూడా ప్రేక్షకాదరణకి నోచుకోలేదు. అయితే చేతినిండా సినిమాలు వుండడంతో నారా రోహిత్‌ మళ్లీ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అతని తదుపరి చిత్రం 'రాజా చెయ్యి వేస్తే' ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. కొన్ని డీసెంట్‌ సినిమాలు నిర్మించిన సాయి కొర్రపాటి నిర్మాణంలో వస్తోన్న చిత్రమనేది ఒక కారణమైతే ఇందులో విలన్‌గా నందమూరి తారకరత్న నటించాడు. హీరోగా సక్సెస్‌ లేని తారకరత్న ఈ సినిమాతో విలన్‌గా సెటిలయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అటు హీరో, ఇటు విలన్‌ ఇద్దరూ ప్రస్తుతం స్ట్రగులింగ్‌ ఫేజ్‌లోనే వున్నారు. ఈ టైమ్‌లో నందమూరి, నారా కాంబినేషన్‌ వెండితెరపై కూడా క్లిక్‌ అయి ప్రేక్షకుల ఓట్లు గెలుస్తుందా అనేది చూడాలి. -

,  ,  ,  ,  ,  ,