Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 15:52:06
facebook Twitter Googleplus
Photo

100వ చిత్రం పూర్తి చేసిన తర్వాత సినిమాలు తీయడంలో వేగాన్ని పెంచారు. కుర్ర హీరోలకి ధీటుగా తనదైన శైలిలో పాత్రలను చేస్తూ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా బాలయ్య సినిమాలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా ఆయన చేసే డ్యాన్సులు- యాక్షన్ సీన్స్ కి ఇంకా మంచి ఆదరా లభిస్తోంది. తెరపై ఆయన డైలాగ్ వినబడితే చాలు జనం విజిల్స్ వేయాల్సిందే.

ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తీసిన పైసా వసూల్ సినిమాను రిలీజ్ చేసిన బాలయ్య తన అభిమానులను కాస్త నిరాశపరిచాడు. అయితే ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రెడీ అవ్వబోతున్నారు. సీనియర్ తమిళ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఇప్పటికే నయనతారను అలాగే మలయాళీ బ్యూటీ నటాషా దోషిని కూడా ఒకే చేశారు. మరొక హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే అందులో నయన బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నారు కాని.. నటాషా మాత్రం హీరోయిన్ కాదట.

కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కూతురిగా కనిపించనున్న నటాషా పాత్ర చాలా కీలకం కానుందట. బాలయ్య ఎప్పుడు కనిపించని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. 40ఏళ్ల వయస్కుడిగా సరికొత్తగా అలరించనున్నాడని తెలుస్తోంది. మొదట నటాషా సినిమాలో హీరోయిన్ అనే వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు బాలయ్య కూతురు అని చెబుతున్నారు. మరి ఈ రిలేషన్ బాలయ్య సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమాకు జయసింహ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.

,  ,  ,  ,  ,  ,