Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 11:11:03
facebook Twitter Googleplus
Photo

పేరుకు ఆంటీనే అయినా.. కుర్రపిల్ల మాదిరి హుషారుగా ఉండటమే కాదు.. మాటలతో.. చూపులతో కిక్కు ఎక్కించే అందం అనసూయ సొంతం. పేరుకు యాంకరే అయినా హీరోయిన్ కు ఉండేంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనసూయకు ఉంటుంది. ఆ మధ్యన వచ్చిన సినిమాలో అనసూయ కోసమే సినిమాకు వెళ్లినోళ్లూ ఉన్నారు. యాంకరింగ్ తో పాటు.. స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. గత కొంత కాలంగా ఒక చానల్ నిర్వహించే షోలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ మాటలు.. హావభావాలు ప్రోగ్రాంను అలా చూస్తుండిపోయేలా ఉంటున్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ప్రోగ్రాంకు టాలీవుడ్ నటుడు నవదీప్ గెస్ట్ గా వచ్చాడు. గంటకు పైగా సాగే ఈ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న దగ్గర అనసూయ మాటలు.. దానికి కౌంటర్ గా అనసూయకు వేసిన పంచ్ తో ఆమె నోట మాట రాలేదు. కామెడీగా మాట్లాడినా..నవదీప్ పుణ్యమా అని అనసూయ నోటి నుంచి మాట రాలేదు. మరి.. అంత ఘాటు వ్యాఖ్యనే చేశారు నవదీప్.

మీకు మూడు క్యాస్టూమ్స్ ఇస్తే మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారన్న అనసూయ.. నవదీప్ కు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒకటి సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్ కాగా.. తాను బ్యాట్ మ్యాన్ ఎంచుకుంటానని నవదీప్ సమాధానమిచ్చాడు. దానికి స్పందించిన అనసూయ.. నేను మీరు సూపర్ మ్యాన్ చెబుతారని అనుకున్నా అంది.

ఎందుకు.. డ్రాయర్ చూద్దామనా?.. ఎందుకు నీ చూపు అక్కడే ఉంటుంది? అయినా.. ఇప్పుడు సూపర్ మ్యాన్ డ్రాయర్ చూపించట్లేదు? గతంలో లాగా కాడు.. మొత్తం అన్నీ లోపల వేసేసి చూపిస్తున్నారు? డ్రాయిర్ చూద్దామనే? అంటూ కొంటెగా అడిగేసరికి అనసూయకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అనసూయ ఏంటి? ఆ స్థానంలో ఎవరున్నా ఏమనగలరు..?

,  ,  ,  ,  ,