Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:24:58
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ తని ఒరువన్ ని రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హీరో మినహాయించి ప్రధాన పాత్రధారులతో కీలక సన్నివేశాలను దాదాపు ఓ కొలిక్కి తెచ్చేశారు. ఇప్పుడీ మూవీలోకి యంగ్ హీరో నవదీప్ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. సినిమాలోని ఓ ప్రధానమైన పాత్రకు నవదీప్ ను తీసుకున్నారు.

ధృవ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ పోలీస్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ కేరక్టర్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఐపీఎస్ ఆఫీసర్స్ పాత్రలు ఉంటాయి. ఆ పాత్ర కోసమే నవదీప్ ను కాస్టింగ్ లోకి తీసుకున్నారని తెలుస్తోంది. తమిళ్ లో గణేష్ వెంకట్రామన్ - హరీష్ ఉత్తమన్ లు ఫ్రెండ్స్ రోల్స్ పోషించగా.. ఈ రెండింటిలో ఏ పాత్రకు నవదీప్ ను తీసుకున్నారో ఇంకా తెలియలేదు.

అయితే.. నవదీప్ చేయనున్న కేవలం హీరో ఫ్రెండ్ రోల్ మాత్రమే కాదు. స్టోరీలో ఇద్దరు స్నేహితుల రోల్స్ చాలా ఇంపార్టెంట్. కథకు కీలకంగా నిలిచే ముఖ్యమైన పాత్రలు. అందుకే ఈ రోల్ కు వెంటనే యాక్సెప్ట్ చేశాడట నవదీప్. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా.. అరవింద్ స్వామి విలన్ రోల్ లో కనిపించనుండడం స్పెషల్ అట్రాక్షన్. ఈ దసరాకు విడుదల చేసేందుకు ధృవ యూనిట్ ప్రయత్నిస్తోంది.

,  ,  ,  ,  ,  ,