Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:21:49
facebook Twitter Googleplus
Photo

ఫిలిం ఇండస్ర్టీలో అంతే.. ఒక్కోసారి అవకాశం వచ్చినట్లే వస్తుంది.. మరోసారి టకీమని జారిపోతుంది. ఉదాహరణకు 2001లో ఇష్టం సినిమా తీసిన విక్రమ్ కె కుమార్ ఆ తరువాత 6 ఏళ్ళ వరకు ఎక్కడా కనిపించలేదు. ఇకపోతే అసలు ''రక్త చరిత్ర'' అనే సినిమాను జగపతిబాబు హీరోగా.. దర్మ-రక్ష అంటూ ఇద్దరు అన్నదమ్ములు మొదలెట్టారు. కాని దానిని రామ్ గోపాల్ వర్మ హైజాక్ చేశాడు. మరి ఈ ఇద్దరూ ఏమయ్యారు?

అందాల రాక్షసి హీరో నవీన్ చంద్రను లీడ్ లో పెట్టి.. ఈ కవల అన్నదమ్ములు దాదాపు 6 ఏళ్ళ తరువాత ఇప్పుడు ''చందమామరావే'' అంటూ ఒక సినిమా తీస్తున్నారు. అప్పుడెప్పుడో మిస్సయ్యి ఇన్నాళ్ళకు ఇప్పుడు తేరుకున్నారు వీరు. అయితే ఈ కవలల కథ తెలిసిన వారు చాలా తక్కువమందే. కాని ఒక్కసారి గూగుల్ లో ధర్మ-రక్ష అని టైప్ చేస్తే.. ఖచ్చితంగా జగపతి బాబు హీరోగా మొదలైన వీరి రక్తచరిత్ర పోస్టర్లు దర్శనమిస్తాయి. మరి రామ్ గోపాల్ వర్మ ఆ ప్రాజెక్టును హైజాక్ చేశాక.. మనోళ్లు ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారు అనే విషయంపై క్లారిటీయే లేదు.

సర్లేండి.. ఎప్పుడొచ్చాం అన్నది కాదయ్యా.. సినిమా హిట్టా లేదా అనేది ముఖ్యం.. హిట్టు కొట్టాలని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,