అనామిక, మాయ తర్వాత నయనతార నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ దొర. ఇది కాకుండా కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో చిత్రంలో నటిస్తున్నారామె. తాజాగా మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ?పొంబళ? పేరుతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు బాలకుమార్ తెరకెక్కించనున్నారట. ఇందులో ఓ కీలక పాత్రను నమిత చేయనున్నారని సమాచారం. 2007లో రూపొందిన తమిళ ?బిల్లా?లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ?పొంబళ?లో కలసి నటించనున్నారన్న మాట. అవునూ.. ఇంతకీ ?పొంబళ? అంటే ఏంటో తెలుసా? ?మహిళ? అని అర్థం
Nayanthara, Namitha, Work, Together, Matter, Tollywood,