Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 10:44:21
facebook Twitter Googleplus
Photo

చూస్తుంటే ఇప్పుడు సెక్సీ లేడీ నయనతార టార్గెట్ ఒక్కటే ఒక్కటిగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగు లేదా తమిళంలో రాజసం ఉట్టిపడే రాణి పాత్రలను సరిగ్గా పోషించిన హీరోయిన్లే లేరు. ఆ మధ్యన విజయ్ పులి సినిమాలో శ్రీదేవి కూడా ఘోరంగా ఫెయిలైంది. అయితే నయన మాత్రం.. ఈ మధ్య హిట్టయిన మరో ఇద్దరు రాణులను బీట్ చేసే యోచనలో ఉందట.

త్వరలో రిలీజవ్వనున్న ''కాష్మోరా'' సినిమాలో రాణి మహారత్నదేవి పాత్రను నయన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ అంతగా ఎక్సయిటింగ్ గా లేకపోయినా కూడా.. సినిమాలో అమ్మడు కత్తిపట్టుకున్న విధానం చూస్తుంటే.. బాహుబలి రాజమాత శివగామిని.. అలాగే రుద్రమదేవిని కూడా మించిపోవాలనే కోరిక బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాని సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. అలాగే రుద్రమగా అనుష్కలు.. సదరు పాత్రల్లో మైండ్ బ్లోయింగ్ గా జీవించేశారు. వారి రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేయడమంటే మాటలు కాదు. పైగా నయన్ ఎప్పుడూ అంత ఇంటెన్సిటీని పుల్ చేసిందే లేదు. మరి కాష్మోరాతో నయన్ బీట్ చేస్తుందా?

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదివ్య అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాంటసీ ఎపిసోడ్ లోనే లేదు. ఆమె ఒక స్టూడెంట్ పాత్రను పోషిస్తోందట. లైబ్రరీలో బ్లాక్ మ్యాజిక్ (చేతబడులు) గురించి రీసెర్చ్ చేస్తూ వీరి కథను ఆమె తెలుసుకుంటుంది. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,