Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 15:22:51
facebook Twitter Googleplus
Photo

మెగాడాటర్ నీహారిక మరో మూడు రోజుల్లో సినీ అరంగేట్రం చేస్తోంది. జూన్ 24న విడుదల కానున్న ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ హీరోయిన్ గా కొత్త జీవితం స్టార్ట్ చేస్తోంది నీహారిక. మొదట యాంకర్ - తర్వాత హోస్ట్ - ఆ తర్వాత షార్ట్ ఫిలిం యాక్ట్రెస్.. ఇప్పుడు హీరోయిన్.. ఇలా తన కెరీర్ ని షార్ట్ టైమ్ లోనే చాలా మలుపులు తిప్పింది ఈ మెగా డాటర్.

మరి హీరోయిన్ కాకపోతే నీ టార్గెట్ ఏమయ్యేది? అనే ప్రశ్న ఒక మనసు ప్రమోషన్స్ లో ఉన్న నీహారికకు ఎదురైంది. దీనికి ఈ చిన్నది ఇచ్చిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి స్టార్ట్ చేసిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ ను హ్యాండిల్ చేసే దాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది నీహారిక. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలానే బ్యానర్స్ ఉన్నాయి. కానీ గతంలో అల్లు అరవింద్ నిర్మాతగా సక్సెస్ అయినట్లుగా.. వేరెవరూ విజయం సాధించలేదు.

చిరు తమ్ముడిగా అంజనా ప్రొడక్షన్స్ ను నాగబాబు స్టార్ట్ చేసినా.. ఒక్క బావగారూ బాగున్నారా తప్పితే మిగిలినవన్నీ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. చివరగా తీసిన ఆరెంజ్ అయితే.. మెగా బ్రదర్ ను అప్పుల్లో ముంచెత్తింది. అలాంటి బ్యానర్ ను తిరిగి స్టార్ట్ చేసి.. తండ్రి మొదలుపెట్టిన సంస్థను నిలబెట్టేందుకు ప్రయత్నించేదాన్నని నీహారిక చెప్పిన స్మార్ట్ ఆన్సర్.. అందరికీ నచ్చింది.

,  ,  ,  ,  ,