Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2017 14:26:06
facebook Twitter Googleplus
Photo

యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థకు.. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటికి మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కెరీర్లో నిలదొక్కుకోవడానికి ముందు నుంచే స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా ఏళ్ల పాటు ప్రయాణం చేశారు. ఒకరికొకరు సహకరించుకున్నారు. దర్శకుడిగా చందూ తొలి సినిమా కార్తికేయ లో నిఖిలే హీరో అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిఖిల్ చేసిన సూర్య వెర్సస్ సూర్య కు చందూ మాటలు అందించాడు. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమాకు కొంచెం టైం పట్టే అవకాశం ఉండటంతో ఆలోపు కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ రీమేక్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు నిఖిల్.

నిఖిల్ ఇంతకుముందు చేసిన రీమేక్ శంకరాభరణం తేడా కొట్టేసిన నేపథ్యంలో ఈసారి జాగ్రత్త పడుతున్నాడతను. కిరిక్ పార్టీ రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీర్చిదిద్దే బాధ్యతను చందూకే అప్పగించాడట నిఖిల్. ఈ చిత్రానికి రాజు సుందరం దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఐతే ప్రేమమ్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు చక్కగా తీర్చిదిద్దిన చందూకే కిరిక్ పార్టీ రెస్పాన్సిబిలిటీని కూడా ఇచ్చాడట నిఖిల్. ఈ చిత్రానికి మాటలతో పాటు అడిషనల్ స్క్రీన్ ప్లే చందూనే అందిస్తాడట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కాలేజీ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లో రిషబ్ శెట్టి రూపొందించిన కిరిక్ పార్టీ గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది.

,  ,  ,  ,  ,