Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:46:49
facebook Twitter Googleplus
Photo

డిఫరెంట్ మూవీస్ చేయడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన కుర్ర హీరో నిఖిల్. తన సినిమాలను స్మాల్ నుంచి మీడియం బడ్జెట్ లో చేస్తూ.. భారీ హిట్స్ కొట్టేస్తున్నాడు. తాజాగా తొలి పరిచయం అనే మూవీ ట్రైలర్ ని లాంఛ్ చేసిన నిఖిల్.. సినిమాతో పాటు.. ఇండస్ట్రీ పరిస్థితుల గురించి ఓపెన్ గా మాట్లాడేశాడు.

'తొలి పరిచయం పోస్టర్స్.. ట్రైలర్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. చాలా మంది కొత్త నిర్మాతలు దర్శకులు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్స్ ధైర్యంగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కువమంది రైటర్స్ రావాలి.. ఎక్కువ కథలతో కొత్త సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి. చాలామంది కొత్త వాళ్లు చాలా వినూత్నమైన ఆలోచనలతో పరిశ్రమలోకి వస్తున్నారు. సినిమాలు షూటింగ్ చేసిన తర్వాత.. దాని రిలీజ్ ఎలా.. మార్కెటింగ్ ఏంటి అని తెలియక ఆగిపోతున్నారు. నాకు తెలిసిన చాలా మంచి సినిమాలు జస్ట్ రిలీజ్ అలా ఆగిపోవడం జరిగింది' అన్నాడు నిఖిల్.

'ఈ విషయంలో కళహర్ ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. అతనికి అభినందనలు. తొలిపరిచయం హీరో వెంకీ.. హీరోయిన్ లాస్య.. దర్శకుడు ఎల్. రాధాకృష్ణ.. నిర్మాత దీపక్ కృష్ణ లకు అభినందనలు. చాలామంది యాక్టర్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ తీశారు. ఈ మధ్య సినిమాలు కొంచెం బాగున్నా సరే 20-30 కోట్లు టచ్ చేస్తున్నాయి. ఇలాంటి సినిమాల విషయంలో పబ్లిక్ మూడ్ కూడా బాగుంది. సినిమా బాగుంటే చాలని కోరుకుంటున్నారు' అంటూ తొలిపరిచయం టీంకి అభినందనలు చెప్పాడు నిఖిల్.

,  ,  ,  ,  ,  ,  ,