Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 14:32:45
facebook Twitter Googleplus
Photo

తెలుగులో ప్రేమ కథా చిత్రం అంటూ మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ.. ఓ ట్రెండ్ సెట్టర్. ఆ చిత్రాన్ని తమిళ్ లో డార్లింగ్ పేరుతో రీమేక్ చేస్తే.. ఇక్కడ నందిత పోషించిన రోల్ ను.. అక్కడ నిక్కీ గల్రాని చేసింది. అక్కడి నుంచి తమిళ్ ఆడియన్స్ కు ఈమె డార్లింగ్ అయిపోయింది. ఇండస్ట్రీ జనాలు కూడా డార్లింగ్ అనే పిలుస్తున్నారట.

తెలుగులో కృష్ణాష్టమి చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి మంచి గుర్తింపే వచ్చింది కానీ.. ఆ స్థాయిలో అవకాశాలు కనిపించలేదు. అయితే.. తమిళ్ లో ఫుల్లు బిజీగా ఉండడంతోనే అప్పట్లో తెలుగు సినిమాకు సైన్ చేయలేకపోయానని చెబుతున్న నిక్కీ.. ప్రస్తుతం మరకతమణి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ్ లో మరగధ నానయం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను.. తెలుగులో మరకతమణి టైటిల్ పై డబ్బింగ్ చేయగా.. సరైనోడు విలన్ ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

దొంగతనాలు చేసుకుంటూ బతికే ఓ ఐదుగురు ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. వీళ్లకు ఓ రంగు రాయి దొరుకుంది. దానికి చాలా పవర్స్ ఉంటాయి. దాన్ని ముట్టుకుంటే మాడిపోయేంతటి పవర్ అన్నమాట. అది దొరికాక వాళ్ల లైఫ్ లో ఎలాంటి ఛేంజెస్ వచ్చాయన్నదే మరకతమణి' అంటున్న నిక్కీ

,  ,  ,  ,  ,